![]() |
![]() |
.webp)
బుల్లితెర పెద్ద పండుగగా భావించే పద్మ మోహన అవార్డ్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఎంతోమందికి తమ నటనకి గాను అవార్డులు వచ్చాయి. వారిలో 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ లో క్రిష్ కి జోడిగా వేద పాత్రకి బెస్ట్ హీరోయిన్ అవార్డు లభించింది.
కోల్‌కతాలో టెన్త్ చదువుకుంటున్న సమయంలో దేబ్జాని ఓ మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లేదట. ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ఓ మహిళ కనిపించి సీరియల్లో నటిస్తావా అని సూటిగా అడిగిందట.దీంతో షాక్ అయిన దేబ్జాని.. తన తల్లిదండ్రులను సంప్రదించండని చెప్పిందట. ఇక ఆ మహిళ దేబ్జానితో పాటు తన ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మ నాన్నను ఒప్పించిందట. ఆ తర్వాత తనకి బెంగాలీలో ఓ సినిమాలో ఆఫర్ వచ్చిందంట. దాంతో తన దశే మారిపోయిందంట. బెంగాలీలో రెండు సినిమాల్లో నటించిన దేబ్జాని ఆ తర్వాత అదే భాషలో తొమ్మిది సీరియల్స్‌లో నటించింది.
ఇక తెలుగులో 'ఎన్నెన్నో జన్మలబంధం' సీరియల్ తో అరంగేట్రం చేసింది. మొదటి సీరియల్ లోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ప్రస్తుతం స్టార్ మా టీవీలోనే ' సత్యభామ ' సీరియల్ లో నటిస్తుంది. అయితే ఈ సీరియల్ లో కూడా వేదకి జంటగా యష్ అలియాస్ నిరంజన్ నటిస్తున్నాడు. కాగా ఈ సీరియల్ కు ఫ్యాన్ బేస్ ఉంది. అయితే స్టార్ మా టీవీలో ప్రసారమైన వాటిల్లో 'కార్తీక దీపం' సీరియల్ తర్వాత ఎన్నెన్నో జన్మలబంధం, గృహలక్ష్మి సీరియల్స్ కి ఆ స్థాయి గుర్తింపు లభించింది. అయితే తాజాగా విడుదల చేసిన పద్మమోహన అవార్డులలో వేద పాత్రకి గాను దేబ్జానికి అవార్డు రావడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఇది స్పెషల్ మూమెంట్ అని దేబ్జాని వీడియో రికార్డు చేపించుకుంది. దానిని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది దేబ్జాని. ఇక వేద-యష్ ల ఫ్యాన్స్ కంగ్రాంట్స్ ఏంజిల్ అంటు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ అవార్డుల ఫంక్షన్ కి అవార్డు అందుకున్న వారంతా తమ తమ పేజీలలో షేర్ చేసుకుంటున్నారు. దేబ్జానికి ఉండే ఫ్యాన్స్ ఎక్కువే కాబట్టి తను అవార్డు అందుకుంటున్నప్పుడు తీసుకున్న ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.
![]() |
![]() |